అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంపై మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కోరింది దీంతో భయంతో విద్యార్థులు ఉపాధ్యాయులు పరుగులు తీశారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాలు కారణంగా ఆ భారీ వృక్షం పాఠశాల భవనంపై కూలిందని స్థానికులు తెలియజేశారు. ఒక్కసారిగా పాఠశాల భవనంపై ఈ వృక్ష కోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు భయాందోళన గురయ్యారు.