శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి వద్ద మంగళవారం మతిస్థిమితం లేని అమ్మాయిని ఆటో డ్రైవర్ ముబారక్ గొడ్డలితో దాడి చేసి విచక్షణారహితంగా వ్యవహరించాడు. గొడ్డలితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా కదిరి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పట్టణ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.