అద్దంకిలోని గరటయ్య కాలనీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ కు చెందిన డేవిడ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.