శనివారం రాత్రి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద తలపులపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉపాధ్యాయుడు సిద్దయ్య శెట్టికి కొవ్వొత్తుల ప్రదర్శనతో యుటిఎఫ్ నేతలు ఘన నివాళులు అర్పించారు. డిఇఓ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.FLN శిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు గుండెపోటుతో మరణించాలని, రోడ్డు ప్రమాదంలో మరో ఉపాధ్యాయుడు మరణించారని, గతంలో నాడు నేడు పనులలో మానసిక ఒత్తిడికి గురై ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు