పీలేరు మండలంలోని పలు ఎరువుల దుకాణాలను కడప విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.పీలేరు మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్,శ్రీనివాస ఫర్టిలైజర్స్,గ్రోమోర్,వాసవి కంపెనీ,అన్నపూర్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలను,గోదాములను తనిఖీ చేశారు. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బి.బాబు మోసెస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యూరియా కొరత దృష్టిలో పెట్టుకొని డీలర్లు యూరియాను అక్రమంగా నిల్వ ఉంచిన,ఎంఆర్పి కన్నా అధిక ధరలకు అమ్మిన,డీలర్ల పై తగు చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.డీలర్లు అమ్మిన యూరియా లావాదేవీలు, ఇన్వాయిస్ రిజిస్టర్లు,గోదాములను తనిఖీ చేశారు