సుంకి ఐ.టి.డి.ఎ. పార్క్ సమీపంలో స్కూటీ పై వెళుతున్న ఓ వ్యక్తి గుండెపోటుతో గురువారం కుప్పకూలాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రామినాయుడు వలస గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి పెద్దింటి సూర్యనారాయణ స్కూటీపై వెళ్తుండగా సుంకి వద్ద ఉన్న ఐటీడీఏ పార్కు వద్దకు చేరుకునేసరికి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్కూటీ ను పార్క్ చేసి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సఫర్యలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.