మలేరియా అధికారులు దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమల లార్వాను తినేసే గాంబిసియా చేపలను గుర్తించిన నీటి కుంటల్లో వదిలారు. శుక్రవారం సాయంత్రం రాయదుర్గం టౌన్ లో దుగ్గిలమ్మగుడి సమీపంలోని నీటి కుంటతో పాటు మరో 11 నీటి కుంటల్లో గాంబిసియా చేపలను వదిలినట్లు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్ తెలిపారు. మస్కీటో ఫిష్ గా ప్రసిద్ధి చెందిన గాంబిసియా చేపలు నీటిలో ఉండే దోమల లార్వాలను తిని నశింపజేస్తాయని, ఒక్క చేప రోజుకు 100–300 వరకు దోమ లార్వాలను తినగలదని తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికన్ గునియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నియంత్రణలో ఇవి సహజ పరిష్కారం అవుతాయని వెల్లడించారు.