ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామ సమీపంలో చెరువులో ఉన్న గేదెను బయటికి తోలే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు నీటిలో మునిగి మృతి చెందారు. రైతు సుబ్బయ్య రోజు లాగానే గేదెను మేపటానికి తమ దగ్గరలోని అన్నగారి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. చెరువులో ఉన్న గేదను తోలుతో సుబ్బయ్య చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.