పుత్తూరు డీఈ ఆఫీసులో విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక జరిగింది. విద్యుత్ అదాలత్ ఛైర్ పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, రిటైర్డ్ జడ్జి ముఖ్య అతిధిగా గురువారం హాజరయ్యారు. పుత్తూరు మండలం తడుకు పంచాయతీలో చేరిన ఎగువ గూళూరు దళితవాడ, దిగువ గూళూరు గ్రామాలలో గత 65 సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.