ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారని ఏటూరునాగారంలో ముస్లిం కమిటీ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ముస్లింలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 1.50కోట్లు మంజూరు చేస్తూ మంత్రి సీతక్క శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్థానిక జమా మసీదులో మత పెద్దలు, కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.