బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి ఆదివారం ఆదిలాబాద్లో మాట్లాడుతూ, ఎంతో ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. బీజేపీ నిరసన నేపథ్యంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆమె సూచించారు.