ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలసి అర్జిదారుల నుండి 20 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు.