అన్నమయ్య జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ప్రాంతీయ కార్యాలయం కడప ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి గణేష్ విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పోస్టర్ ఆవిష్కరించబడింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "PoP విగ్రహాలు నీటిలో కరగకపోవడం వల్ల నదులు, చెరువులు తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయి. అందువల్ల ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి" అని ప్రజలకు పిలుపునిచ్చారు.