Araku Valley, Alluri Sitharama Raju | Aug 21, 2025
జిల్లాలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు రుణాలు ద్వారా వాహనాలు ఇప్పించాలని ట్రైకార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్, ఎండీ మణికుమారి లను కోరినట్లు జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలినారు. ఈ సందర్బంగా గిరిజన సంక్షేమం కోసం రెండు సంస్థలు కలిసి చేపట్టవలసిన కార్యక్రమాలు, గిరిజన ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం ఉపాధి పథకాలు, సహకార రంగంలో బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.