ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన ఉన్న ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి రాకపోకలకుఅంతరాయం కలుగుతోంది. ఇందులో భాగంగానే బేలా మండలం సయిద్ పూర్ సమీపంలోని వాగు శుక్రవారం ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన వెంటనే రాకపోకలను కొనసాగించాలని అధికారులు సూచించడంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.