శ్రీకాకుళం : మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనకు మన మంతా కృషి చెయ్యాలని మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన. కృష్ణదాస్ పిలుపు నిచ్చారు..మంగళవారం శ్రీకాకుళం నగరం లోని సెవెన్ రోడ్ జంక్షన్ లో ధర్మాన. కృష్ణ దాస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల ఆశాజ్యోతి గా చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.. సమాజానికి మేలు చేసే ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు తెచ్చారని కొనియాడారు.