గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట ప్రధాన రహదారిపై పారుతున్న వరదనీరు సమస్యను పరిష్కరించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని నిత్యం వాహనాలు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు పారుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు.