ఆలు నియోజకవర్గంలో శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని, డీఎస్పీ వెంకట్రామయ్య ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆలూరు తాలూకా ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వినాయక చవితి పండుగ జరుపుకోవాలన్నారు. సోదర భావంతో వేడుకలు జరుపుకోవాలని వారు సూచించారు. అల్లరి ముఖాలపై నిఘా ఉంచామన్నారు.