పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లోకల్, నాన్ లోకల్ క్రైస్తవ సంఘాల మధ్య ఆధిపత్య పోరు తలెత్తింది. "హలో క్రైస్తవ – చలో పాలకొల్లు" అంటూ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి పిలుపునిచ్చి, అడబాల గార్డెన్స్ వద్ద ప్లెక్సీలు, ప్లకార్డులతో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆందోళన చేపట్టింది. ఇతర ప్రాంతాల నుంచి నిర్వహించే క్రైస్తవ సభను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఇదే సమయంలో హాల్లో ప్రార్థనా కూటమి కొనసాగుతుండగా, వివాదం కారణంగా పోలీసులు భారీగా మోహరించారు.