శక్తి యాప్ మహిళలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతుందని శక్తి టీం పోలీసులు పేర్కొన్నారు. శనివారం డోన్లోని అమ్మ హోటల్ వద్ద మహిళలకు అవగాహన కల్పించారు. శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.