ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యా యులు వీర రాఘవయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ కె. ప్రమోద్, అపుస్మా నియోజకవర్గ అధ్యక్షుడు టి.అమీర్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాన వక్త కే.ప్రసాద్, సీనియర్ ఉపాధ్యాయులు శేషనయన రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.