శ్రీ మాసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం గ్రామంలోని ఎమ్.జే.పి స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8,9,10వ తరగతి చదివే విద్యార్థులకు డైరీలు పంపిణీ చేశారు. గురువారం మధ్యాహ్నం టీడీపీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి సవిత ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ శ్రీనివాస్, సింగల్ విండీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి, మాజీ సర్పంచులు సూర్యనారాయణ, సోమశేఖర్, గోపాల్, జనసేన కుమార్, తదితరులు పాల్గొన్నారు.