Araku Valley, Alluri Sitharama Raju | Aug 24, 2025
హుకుంపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతు హల్చల్ చేస్తుండడంతో పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో కుక్కలు దాడి ఘటనలు వెలుగులోకి రావడం, హుకుంపేటలో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండల కేంద్రానికి పనుల నిమిత్తం నిత్యం ప్రజలు వస్తుంటారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు.