నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎల్లికట్టు గ్రామంలో శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) పురుగుమందు తాగి ఆత్మహత్యకు యాంత్రించాడు గమనించిన కుటుంబీకులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.