ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గితే గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు.