సి బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వ్యవసాయ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి నబి రసూల్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలపేతంలో వ్యవసాయ కార్మికులది ప్రధాన పాత్రని తెలిపారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలంటే ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు.