Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో ఆర్డీవో బి పావని అధ్యక్షతన గిరిజనుల సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గిరిజనులకు సంబంధించిన వారి అవసరాలు వారి కావలసిన వసతుల సమస్యలతో కూడిన విజ్ఞప్తులను పలువురు గిరిజనులు ఆర్డీవో బి.పావని కి అందించారు. ఈ సందర్భంగా అర్జీలు అందించిన వారు మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తమ అవసరాలను తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని దీనిని వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.