ఆలిండియా వర్కింగ్ ఉమెన్ సమావేశాలను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు,ఆలిండియా వర్కింగ్ ఉమెన్ జాతీయ సదస్సు నవంబర్ 1,2తేదీల్లో హైదరాబాదులో జరగనున్నవని,అదేవిధంగా రాష్ట్ర సదస్సు సిర్పూర్ కాగజ్ నగర్ లో అక్టోబర్ 5,6 తేదీల్లో జరుగుతుందని ఆర్టీసీ రంగంలో పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్ మహిళలందరూ సదస్సు జయప్రదం కావడానికి సహకరించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ విజ్ఞప్తి చేశారు.ఖమ్మం లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఏర్పాటు అయిన స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కమిటీ సమావేశంలో భాస్కర్ పాల్గొన్నారు