సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సోమవారం సాయంత్రం డిఆర్డిఏ కార్యాలయ ప్రకటనలో తెలిపింది. స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో పనిచేయుటకు పదవ తరగతి ,ఇంటర్మీడియట్ పాసైన మహిళలు, ఐటిఐ పూర్తిచేసిన యువతి, యువకులు ఈనెల 11న జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.