పెద్ద కడబూరు : మండల కేంద్రంలో హెల్త్ వెల్నెస్ సెంటర్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా దాతలకు మంగళవారం నిక్షయ్ మిత్ర సర్టిఫికెట్లు అందజేశారు. 15 మంది పేద క్షయ వ్యాధిగ్రస్థులకు 5 నెలల పాటు పోషకాహార కిట్లు పంపిణీ చేయగా, మరో ఐదుగురికి కిట్లు ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు. మెడికల్ ఆఫీసర్లు పేద రోగులను దత్తత తీసుకోవాలని దాతలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ క్షయ పరీక్షలు, ఎక్స్రేలు చేయించుకోవాలని సూచించారు.