పాలకుర్తి MLA క్యాంపు కార్యాలయంలో MLA యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు.గణేశ్ నవరాత్రుల ప్రారంభ సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు,టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.పూజా కార్యక్రమం ఘనంగా,భక్తిశ్రద్ధలతో సాగింది. స్థానిక పండితులు మంత్రోచ్ఛారణల మధ్య వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.