మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎల్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డేవిడ్ గుండెపోటుతో మరణించాడు. మల్కాజిగిరి ఆనందబాబు విష్ణుపురి కాలనీకి చెందిన డేవిడ్ శనివారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం కాలనీలో వినాయకుడి నిమజ్జనంలో డాన్స్ చేస్తూ ఒక్కసారి కుప్పకూలాడు. హుటా హుటాని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.