సూర్యాపేట జిల్లా: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి సోమవారం అన్నారు. సోమవారం చివ్వెంల మండలం గుంపులలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేదింటి సొంటి కలను నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గత 10 యేండ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.