నాలుగు నెమళ్లు, ఒక జింకను వేటాడి హతమార్చిన కేసులో ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. గిమ్మకు చెందిన రాథోడ్ సందీప్, జైనథ్ కు చెందిన సంజీవ్, మహారాష్ట్రకు చెందిన నీలేశ్, రోషన్ లతో కలిసి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో వాటిని హతమార్చి భోరజ్ లో విక్రయిస్తున్నట్లు FDO చిన్న విశ్వనాథ్ భూషరెడ్డి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నీలేశ్, రోషన్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.