బాపట్లలో రెడ్ క్రాస్ వార్షిక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం జిల్లా ఛైర్మన్ పదవికి ఎన్నిక చేపట్టారు. రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ గా బీవీ నారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన అనంతరం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు సభ్యులతో కలిసి పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.