ములుగు మండలం బండారుపల్లిలో అంచనా విలువ రూపాయలు 29.00 లక్షల నిధులతో అంతర్గత సి.సి. రోడ్లు నిర్మాణ పనులను మంత్రి సీతక్క నేడు శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోని మహిళలంతా మహిళా సంఘాల్లో చేరాలని, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి పొందుతూ, వడ్డీ లేని రుణాలు పొందుతూ ఆర్థిక వనరులు మెరుగుపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.