వైద్యుల సమ్మె ప్రభావం దేవనకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై తీవ్రంగా పడింది. వైద్య సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో చికిత్స సేవలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర విభాగం మినహా ఇతర విభాగాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని రోగులు కోరారు.