ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని వైయస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు లో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వైసిపి కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యకర్తలు లేనిదే, నాయకుడు లేడని అన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న వస్తూ సమస్యలు వస్తూ ఉంటాయి అని సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందాం అని అన్నారు. వైస్ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి పాల్గొన్నారు.