పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాట్ల గురించి గురజాల డిఎస్పి జగదీష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఎస్పి జగదీష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్బంగా ఈ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు అని తెలిపారు.