నల్గొండ జిల్లా: రైలు కిందపడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లాలోని గురువారం చోటుచేసుకుంది .మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద రైలు కిందపడి యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు .మృతుడు తిప్పర్తి మండలం శిలార్ మయ్య గూడెం గ్రామానికి చెందిన రాయి మహేందర్ గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు.