భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు రైతుల వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 2 రోజులు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు పంటలు కోల్పోయారని, కొన్ని మండలాలలో ప్రతి భారీ వర్షాలు కురిసాయని తెలిపారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలన్నారు.