రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాలులో గణేష్ మండప నిర్వహకులతో పోలీసు అధికారులు సమన్వయ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగే అందుకు పోలీస్ జిహెచ్ఎంసి ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యలు మండప అనుమతి విధానం ప్రజల సౌకర్యాలపై అధికారులు వివరాలను అందించారు. ఏడిసిపి ఏసిపి సీఐ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.