నారాయణఖేడ్ మున్సిపల్లోని గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల అవసరాలు, పుస్తకాల లభ్యతపై వివరాలు పాఠకులను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ , కాంగ్రెస్ నాయకులు రమేష్ చౌహాన్, వ్యవసాయ అధికారి నూతన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.