చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు హై స్కూల్ గేటు కూడలిలో బుధవారం మధ్యాహ్నం బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు మండలంలోని మోగరాల పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రఘు రోడ్డు దాటుతుండగా పీలేరు డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది ఈ ప్రయాణంలో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.