నల్లగొండ జిల్లా: యూరియా సరఫరాలో జాప్యం కారణంగా విసిగిపోయిన రైతులు త్రిపురారంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బుధవారం తమ నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సమాచారం అందుకున్న త్రిపురారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు .పోలీసుల హామీతో రైతులు ధర్నాలు విరమించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.