ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు వాగ్మారే మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు వెంటనే మధ్యాహ్న భోజనం అమలు చేసి విద్యావ్యవస్థపై ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.