మంత్రాలయం:- నియోజవర్గంలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. నియోజవర్గంలోని పెద్ద కడబూరు, కోసిగి కౌతాళం మండలాలలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలను ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు పెద్ద కడబూరు 24.4 మీ మీ కోసిగి 5.2 మీ మీ కౌతాళం 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు.