మాలల హక్కుల సాధన కోసం ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో సోమవారం ఉదయం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.