కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో నిర్మిస్తుంటే వైసీపీ ఎందుకు గగ్గోలు పెడుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోమవారం బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.