బుచ్చి : మానవహారం నిర్వహించిన అంగన్వాడీలు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్త ఎల్విశేషమ్మ డిమాండ్ చేశారు. బుచ్చిలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మానవహారం నిర్వహించారు. అంగన్వాడీ ఉద్యోగస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.